AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా పనిచేసిన రజత్ భార్గవను మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా.. రజత్ భార్గవ అడ్డుకోలేదన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఎక్సైజ్ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, ఆర్డర్ ఫర్ సేల్ (OFS) వ్యవహారాల్లో అక్రమాలు, కొన్ని లిక్కర్ బ్రాండ్లకు సంబంధించిన అవకతవకలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయలేదని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. మద్యం కొనుగోళ్లు, OFS ప్రక్రియలో అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ గతంలోనూ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, లిక్కర్ స్కాం కేసులో సిట్ విచారణకు రజత్ భార్గవ గతంలో పలుమార్లు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించినప్పటికీ ఆయన హాజరు కాలేదని పేర్కొంటున్నారు. తాజాగా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని సిట్ అధికారులు స్పష్టం చేయడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు, గత ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేసిన వివేక్ యాదవ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు ఇప్పటికే నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు రజత్ భార్గవ నుంచి సిట్ అధికారులు ఏ అంశాలపై సమాచారం సేకరిస్తారన్నది దర్యాప్తులో కీలకంగా మారింది.. ఇప్పటికే ఎన్నో మలుపు తిరిగుతూ వస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది..
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!