Deputy CM Pawan Kalyan Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష.. ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 'ప్రాయశ్చిత్త దీక్ష'..
- నేడు ఇంద్రకీలాద్రిని దర్శించుకోనున్న పవన్..
- బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan Deeksha: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు.. ఇక, అందులో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.. మరోవైపు వచ్చే నెల 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు పవన్.. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఇక, తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం విదితమే.. భక్తులు.. తిరుమల వేంకటేశ్వర స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించిన విషయం విదితమే..
Read Also: Ponguleti Srinivas Reddy : కేటీఆర్ కి పొంగులేటి సవాల్.. బావా బామ్మర్దుల మధ్య విభేదాలు అందరికి తెలుసు
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు పవన్ కల్యాణ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారన్నారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారని పవన్ వెల్లడించారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయన్నారు. భక్తులు ఏ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్దకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక, ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని సీఎంను కోరామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారన్నారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? సంస్థ ఏమిటని ప్రశ్నించారు. ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎంకి సూచిస్తున్నానని.. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!