Swachh Andhra Awards 2025: నేడు స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డుల ప్రదానం
- నేడు స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డులు ప్రదానం..
- విజయవాడలో అవార్డులను ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు..
- మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డుల ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swachh Andhra Awards 2025: స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డులు ప్రదానం చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ సాయంత్రం విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రదానం చేయనున్నారు.. మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను ఇప్పటికే ప్రకటించింది స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇస్తున్నారు.. స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్సు స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు.. మూడు దశల్లో వెరిఫికేషన్ తర్వాత పూర్తి డిజిటల్ విధానంలో అవార్డులను ఎంపిక చేశారు..
Read Also: TDP vs YCP: టీడీపీ వర్సెస్ వైసీపీ.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
Also Read
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ఈ సారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ జిల్లాగా అనంతపురం తోపాటు 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేశారు.. అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీల విషయానికి వస్తే.. మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), కుప్పం ఉన్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలను పరిశీలిస్తే.. చౌడువాడ (అనకాపల్లి జిల్లా), ఆర్.ఎల్.పురం (ప్రకాశం జిల్లా), లోల్ల (కోనసీమ జిల్లా), చల్లపల్లి (కృష్ణా జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ కడప జిల్లా), కనమకుల పల్లె (చిత్తూరు జిల్లా) ఉన్నాయి.. అద్భుత ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు, స్వయం సహాయక సంఘాలకు కూడా అవార్డులు అందజేయనున్నారు..
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!