NTV Telugu Site icon

CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. విజన్ 2047 కోసం పనిచేస్తున్నా..

Babu

Babu

CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యం.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యం.. స్వామీజీ పై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన నాపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తాం.. అందరూ యదార్థములని కూడా చెప్పేలా ఉండాలి అన్నారు..

Read Also: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్

ఇక, ప్రతి ఒక్కరికీ స్పిరిచువాలిటీ ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు.. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలి.. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.. నేను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని నా చేతికి ఇచ్చారు.. మంచికోసం స్వామీజీ పరితపిస్తారు.. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్నారు.. ఆ తర్వాత 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు..

Read Also: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..

మరోవైపు సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు గణపతి సచ్చిదానంద స్వామి .. కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను.. చంద్రబాబు ఒక కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం. చంద్రబాబుకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.. చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చేయటానికి, చంద్రబాబుకి సమయం ఇవ్వండి. చెడు చేయాలి అంటే వెంటనే చేయొచ్చు, మంచి చేయటానికి సమయం పడుతుందని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.. నిన్నటి వరకు మీ రాజ్యం ఏది అంటే, ఏమి చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చింది. నా అమరావతి రాజధాని అని ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను అని వ్యాఖ్యానించారు గణపతి సచ్చిదానంద స్వామి..

Show comments