Obulapuram Mining Case: రాజకీయ పార్టీల్లో నేతల వలసలు కామన్.. కొందరు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగితే.. మరికొందరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వారికి ఉన్న అవకాశాలతో కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉంటాయి.. అయితే, వారినిపై నమోదైన కేసులు మాత్రం అంత తొందరగా వదలవు కదా..? కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది.. తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది. ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు.
Read Also: Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
కొందరు మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రివర్యులు.. వివిధ పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ప్రభుత్వాలలో కీలక భూమిక పోషిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, కోర్టుకు హాజరైన నేతల విషయానికి వస్తే.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగం జనార్దన్ రెడ్డి వీరంతా ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా ఉన్నారు.. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నో పోరాటాలు చేశారు. కలిసిమెలిసి తిరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీల్లోకి వలస పోగా, ఏపీ నేతలు మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరంతా మంగళవారం ఒక్కసారిగా కలిశారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో అంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత నేతలు అంతా ఒకే చోట చేరడంతో కోర్టు ఆవరణ సందడిగా మారిపోయింది. ఆ నేతలు కూడా ఏ పార్టీలో ఉన్నా.. అంతా అప్యాయంగా పలకరించుకుంటూ మట్లాడుకున్నారు..