Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adinarayana Reddy: కడప జడ్పీ చైర్మన్ వ్యవహారం కూటమిలో కుంపటి రాజేసినట్టు అయ్యింది.. జడ్పీ పీఠం విషయంలో మాట ఇచ్చి తప్పారంటూ ఫైర్ అవుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. రాజీనామాకు సిద్ధమై పోయారు.. అయితే ఒక్కరోజు సమయం ఇచ్చి రేపు నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం రోజు వెల్లడించారు.. ఇక, ఈ రోజు తీవ్ర అసంతృప్తి ప్రకటించారు.. ఎన్డీఏ కూటమిలో పదవులు, రాజకీయ నిర్ణయాల విషయంలో స్పష్టత లేదని ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు.. తమ ఇద్దరు తమ్ముళ్ల కుమారులు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామాలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌తో సమావేశం జరిగిందని, అయితే వారు చెప్పిన విషయాలు తమకు సమంజసంగా అనిపించలేదని వెల్లడించారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు కూడా తమతో మాట్లాడారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కూటమిలో ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అనేక ప్రాంతాల్లో కూటమి పార్టీల మధ్య సరైన స్పష్టత లేదని, ధర్మవరం, అనంతపురం, కోస్తా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులను చూశామని పేర్కొన్నారు. మధుకర్, మాధవ్‌లతో పాటు మరికొందరు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని అన్నారు. చాలా చోట్ల తమ అభ్యర్థులు గెలిచినా, తమ స్థానాలు కూటమి భాగస్వాములకు వచ్చాయని కఠినంగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుతో ఢిల్లీకి రావాలని సూచించారని ఆయన తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో కూడా అభినందనలు తెలిపి, ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తాము ఏమాత్రం సంతృప్తిగా లేమని స్పష్టం చేశారు. తమ పిల్లల రాజీనామాల నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, అవి యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిన తర్వాతే తాను కూడా తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
Also Read
- Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం
- MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
- AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
ఇక, మంత్రి పదవి కోసం తాము బ్లాక్మెయిల్ చేస్తున్నామంటూ కొన్ని కథనాలు రాశారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, దాని కోసం తాను ఎవరినీ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. “నాకెందుకీ మంత్రి పదవి.. డోంట్ కేర్ మంత్రి పదవి” అంటూ వ్యాఖ్యానించారు. తమకు మాధవ్ చెప్పిన తర్వాత, పార్టీ తరఫున అధికారికంగా సమాచారం వస్తుందని ఎదురుచూశామని తెలిపారు. మరోవైపు.. తాగునీటి సమస్య పరిష్కారం కోసం జల్‌జీవన్ మిషన్‌ను పవన్ కల్యాణ్ అడిగితే కేటాయించారని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తనకు సంతృప్తి కలగకపోతే ఢిల్లీలోనే రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా జెడ్పీపీ విషయంలోనూ తొలుత ఎలాంటి ఆలోచన లేదని, చివరి నిమిషంలో కడప స్థానాన్ని మార్చి కృష్ణా జిల్లాను కేటాయించారని వివరించారు. ఒకటి చెప్పి మరొకటి చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆదినారాయణ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
-
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
-
Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
-
Hanu-Man : రెండు ముక్కలైన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ.. ఒకే సినిమాకు రెండు వేర్వేరు సీక్వెల్స్!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
ట్రెండింగ్
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!