ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ పొత్తుల గురించి చర్చ సాగుతోంది.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరితో పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. భయపడే వాళ్లే పొత్తులు గురించి ఆలోచిస్తారన్న ఆయన.. చంద్రబాబుని ప్రజలు నమ్మరన్నారు.. అంతే కాదు, చంద్రబాబుకు అతని మీద అతనికే విశ్వాసం లేదని సెటైర్లు వేశారు. గుంటూరులో జాబ్ మేళాను ప్రారంభించిన విజయసాయిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మరో 25 సంవత్సరాలు వైసీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి..
Read Also: Rahul Gandhi: చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ..
ఇక, ప్రజలను పెట్టిన కష్టాలతో సీఎం పదవి నుండి ప్రజలు చంద్రబాబు నాయుడిని దించేశారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.. నిలకడలేనితత్వం వెన్నుపోటు పొడిచే దుర్మార్గపు మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డ ఆయన.. సొంత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప ప్రజా అభివృద్ది పట్టని నాయకుడు చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను టీడీపీ అధినాయకత్వం ప్రేరేపిస్తుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు సాయిరెడ్డి. మరోవైపు, జాబ్ మేళా నిర్వహించాలన్న సీఎం జగన్ ఆలోచనలో భాగంగానే వేల మంది విద్యార్థులకు ఉపాధి అందించే అవకాశం, అదృష్టం వచ్చిందన్నారు.. చదువు పూర్తయిన ప్రతి ఒక్కరు ఉద్యోగిగా మారాలన్నది సీఎం జగన్ ఆకాక్షం అని.. ఉద్యోగం పొందడం ద్వారా మీ కుటుంబానికే కాదు రాష్ట్రానికి, దేశానికి కూడా యువత మేలు చేస్తారని.. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకు నిబంధనలు ఉంటాయి.. ప్రైవేట్ రంగంలో స్వేచ్ఛగా ఎదిగే ఛాన్స్ ఉంది.. అత్యున్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉందన్నారు సాయిరెడ్డి.