Site icon NTV Telugu

Venugopala Krishna: పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయింది

Venugopala Krishna

Venugopala Krishna

Venugopala Krishna Comments On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నాననే విషయాన్ని తన ప్రకటన ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారని తెలిపారు. దీనివల్ల ఎక్కువగా బాధపడేది జనసైనికులేనని పేర్కొన్నారు. తమకేదో న్యాయం చేస్తాడని అనుకుని జనసైనికులు పవన్‌కి మద్దతిచ్చారని, కానీ ఇప్పుడు ఏం చేయాలో వారికే తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

PM Kisan: వారికి మాత్రమే పీఎం కిసాన్‌ పథకం.. త్వరలో14వ విడతకు మోడీ శ్రీకారం

దేశంలోనే అత్యంత శక్తివంతమైన కోటరీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఎదుర్కొన్నారని చెప్పారు. వారాహిని ఎందుకు లోపల పెట్టారో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీకేష్ (నారా లోకేష్‌ని ఉద్దేశిస్తూ) కోసమే పవన్ ఈ పని చేసినట్లు జనసైనికులకు కూడా అర్థమైందన్నారు. పవన్ కళ్యాణ్‌ను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎన్ని తప్పులు జరిగినా.. ఒక్కసారి కూడా పవన్ ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తీరుపై జనసైనికులకు కూడా స్పష్టత ఏర్పడిందని, చాలామంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. పవన్ పూర్తిగా చంద్రబాబు కోసమే పని చేస్తున్నట్టు స్పష్టం చేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను జనం ఏమాత్రం నమ్మే స్థితి లేదని తేల్చి చెప్పారు.

Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన

కాగా.. ఇటీవల ఏపీలో రానున్న ఎన్నికలపై, పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులు రాజకీయంలో భాగమేనన్న ఆయన.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని.. ఆ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేదని విమర్శించారు. నా స్టార్‌డమ్‌తో ఒక్కరోజులోనే ఏదో అయిపోదామని తాను అనుకోలేదని, కష్టపడితే అనుకున్నది సాధించగలమనని తనకు తెలుసని అన్నారు. ఏపిలోని మెజారిటీ ప్రజలను రక్షించడానికి తాను కొంతమందికి టార్గెట్ అవుతానని, అయినా భయపడనని, అన్నింటికీ సిద్దంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మన బలం ఏమిటో ముందుగా బేరీజు వేసుకోవాలన్నారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండొచ్చని చెప్పిన పాయింట్.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి.

Bihar: జేడీయూ కార్యకర్తలకు మాంసంతో భోజనం.. కుక్కలు కనిపించడం లేదన్న బీజేపీ

Exit mobile version