Site icon NTV Telugu

Varla Ramaiah: సుబ్రహ్మణ్యం హత్యపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే

Varla Ramaiah Phone Tapping

Varla Ramaiah Phone Tapping

ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి. ప్రశ్నించే గొంతులను ఎందుకు నొక్కుతున్నారు? దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దని డీజీపీకి తెలుపుతున్నాను. తూర్పు గోదావరి నుంచి సుబ్రహ్మణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో బలైపోయాడు.

సుబ్రమణ్యం మరణానికి అసలు కారణాన్ని అన్వేషించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు విషయంలో పోలీసులు వేసిన అడుగులన్నీ తప్పటడుగులే. ఎవర్ని రక్షించడానికి పోలీసులు తప్పటడుగులు వేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోలీసులు నడుస్తున్నారు. ఎవరి కోసం ఈ మౌనం? ఎవరి కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు? శవాన్ని అక్కడ పెట్టి వెళ్తే ఆ శవం ఎక్కడి నుంచి తెచ్చావ్? అని పోలీసులు అడగాల్సివుందన్నారు.

పోలీసులు అనంతబాబు గన్ మెన్ లతో మాట్లాడలేదు. ఎస్పీ, డీఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో, సబ్ ఇన్స్ పెక్టరో ఎవరో ఒకరు శవాన్ని తెచ్చినవారితో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థ ఈ అపవాదును ఎందుకు మోస్తోంది. నేరస్థుల్ని రెండు గుద్దాలి, బేడీలు వేసి రిమాండుకు పంపాలి. ఎమ్మెల్సీని నిలదీయాలి. ఎమ్మెల్సీ ఘన చరిత్ర గలవాడంటున్నారు.. ఆ ఘన చరిత్రను వెలికితీయాల్సిన అవసరముంది. ఎమ్మెల్సీ ఘనచరిత్ర చనిపోయిన సుబ్రహ్మణ్యంకు తెలుసు అంటున్నారు దీనిపై విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు వర్ల రామయ్య.

Assam: పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్

Exit mobile version