సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిపై టీడీపీ మహిలా నాయకురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. షర్మిల, విజయమ్మ, సునీతలకు పట్టిన గతి భారతికి పట్టకూడదని కోరుకుంటున్నాని ఆమె అన్నారు. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాల్లో సహధర్మచారిని భారతిని బలిచేస్తున్నారన్నారు. జగన్ భార్య అయినందుకు ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందని, జగన్ అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులకు భారతిని యజమానురాలుగా పెట్టడంతో ఆమె పరిస్థితి చూస్తే జాలేస్తోందని ఆమె అన్నారు. తోటి ఆడపడుచులు, అత్తగారి ఉసురు భారతికి తగులుతోందన్నారు.
అన్న సీఎం అయ్యేందుకు ఎంతో కష్టపడిన జగన్ చెల్లి షర్మిల ప్రాణ రక్షణ కోసం పక్కరాష్ట్రంలో తలదాచుకుంటోందని ఆమె విమర్శించారు. జగన్ అనుమతి లేనిదే సొంత రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితి తల్లి విజయమ్మదని ఆమె ఆరోపించారు. వివేకా హత్య కేసులో న్యాయం చేస్తానని మరో చెల్లి సునీతను దారుణంగా మోసగించారని, ఇప్పటికే సొంత చెల్లెల్లు, తల్లిని రాష్ట్రంలో అక్క చెల్లెల్ని దారుణంగా జగన్ వంచించినందున భారతి అయినా జాగ్రత్త పడాలని ఆమె హితవు పలికారు. జగన్ తల్లి, చెల్లెళ్లతో పాటు రాష్ట్రంలో ప్రతీ ఆడపడుచుకు న్యాయం చేసే నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.