Vallabhaneni Vamsi Mohan: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి రావాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పార్టీని కాపాడడం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌కు అర్థమైందన్నారు. తమ విశ్వయనీయతపై తమకే నమ్మకం లేక జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించారని విమర్శించారు. 2009 తర్వాత జరిగిన మాహానాడులో లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించారని చెప్పారు. తనను వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలియదా? అన్నారు కొడాలి నాని.
Read Also: Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి సంచలన వ్యాఖ్యలు.. నన్ను ఓడిస్తే రాజకీయాలకు గుడ్‌బై..
ఇక, జూనియర్ ఎన్టీఆర్‌ని లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం అతి పెద్ద జోక్‌గా అభివర్ణించారు వల్లభనేని వంశీ.. టీడీపీని స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్.. కానీ, లోకేష్ తాత ఖర్జూరపు నాయుడు కాదన్నారు.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన.. లోకేష్ కు ఇంకా బొడ్డూడనప్పుడే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ కోసం పని చేశారన్నారు.. తన తాత పెట్టిన పార్టీని జూనియర్ చూసుకోగలరు అని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ మోహన్.. మరోవైపు.. చంద్రబాబు గన్నవరమే కాదు.. ఎక్కడికైనా వెళ్లొచ్చు. రాకెట్ నడుముకు కట్టుకుని ఆకాశానికి ఎగరొచ్చు.. గొదాట్లో దూకి కుక్క తోక పట్టుకోవచ్చు.. సెక్షన్ 144 ఉన్నప్పుడు పోలీసులు కొంత మేర నియంత్రిస్తారు.. గతంలో ముద్రగడను.. మంద కృష్ణను పర్యటించకుండా చంద్రబాబు ఆపలేదా..? అని ప్రశ్నించారు..
Read Also: Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..
చంద్రబాబు బషీర్ బాగ్ కాల్పులు చేయించారు.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందని అనుకునే రకం చంద్రబాబన్న వంశీ.. అది పీకుతా.. ఇది పీకుతానని చంద్రబాబు ఎప్పుడూ అంటూనే ఉంటారు.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఏ చిన్న చప్పుడైనా బాబోయ్ బాంబు అంటూ చంద్రబాబు అరిచి గగ్గోలు పెట్టేవారని ఎద్దేవా చేశారు.. 2014లో అధికారంలోకి వచ్చాక.. తాను అతి శక్తిమంతుడినని చంద్రబాబు భావించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోసే ప్రయత్నం చేశారని విమర్శించారు.. అధికారులను మక్కెలిరగ తంతానని చంద్రబాబు లాంటి సీనియర్ మాట్లాడ్డం సరికాదన్న ఆయన.. పశువుల డాక్టరుగా ఉన్నందుకు నేనేం బాధపడడం లేదు.. చంద్రబాబేమైనా ఆర్ఈసీ వరంగలా..? లోకేషేమైనా ఐఐటీ ఖరగ్‌పూరా..? అని ఎద్దేవా చేశారు.. చదువుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు.. లోకేష్‌కు లేదన్న వంశీ.. చంద్రబాబు చేసే పాల వ్యాపారం కోసం పాలను పశువుల నుంచే తీస్తున్నారా..? లేక ఏమైనా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారా..? అని ప్రశ్నించారు. నన్ను పశువుల డాక్టర్ అని విమర్శిస్తున్న చంద్రబాబు.. తిరుపతిలో శిశువుల డాక్టరుకు చేసిన అన్యాయం చెప్పమంటారా..? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.