తిరుపతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీనివాసుని మాతృమూర్తి వకుళ మాత ఆలయ మహా సంప్రోక్షణ క్రతువులో సీఎం పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని పాత కాలవ గ్రామం పేరూరు బండపై వెలసిన వకుళ మాత ఆలయం. వందల ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న వకుళ మాత ఆలయానికి పునర్ వైభవం లభించింది. హైదర్ అలీ దండయాత్రలో ధ్వంసమైందీ ఆలయం. సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
అంతకుముందు జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పూర్ణాహుతిలో పాల్గొని వకుళామాతను తొలి దర్శనం చేసుకున్నారు సీఎం జగన్.వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటారు సీఎం జగన్. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పండితులు.సీఎం జగన్ వెంట మంత్రులు రోజా కూడా వున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ–1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి వెళతారు.
Earthquake : మళ్లీ ఆఫ్ఘాన్‌లో భూకంపం..