Site icon NTV Telugu

AP Capitals: 3 రాజధానులు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నమాట.. అయితే, మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగడంలేదు.. ఇలాంటి సమయంలో మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదన్నారు.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఇక, మూడు చోట్ల రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుంది.. కానీ, మూడు చోట్ల అభివృద్ధి చేయటం కష్టమని తెలిపారు అథవాలే.

Read Also: RK Roja: కేసీఆర్‌పై ఫైర్‌బ్రాండ్‌ ప్రశంసలు..

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం వైఎస్‌ జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించాలని సూచించారు అథవాలే… వైఎస్‌ జగన్‌కు పాలించే అవకాశం రావటం చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులను కలపాలని సూచించానన్నారు.. జగన్‌ పాలన బాగానే చేస్తున్నారని పేర్కొన్న ఆయన.. ఏపీకి కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోసం నేను ప్రయత్నిస్తానన్నారు.. ఇక, వివాదాస్పందంగా మారిన హిజాబ్‌ అంశంపై స్పందిస్తూ.. హిజాబ్‌ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు.. మతం స్కూళ్లల్లో వెళ్లకూడదన్నది నా అభిప్రాయంగా తెలిపిన ఆయన.. స్కూళ్లలో బుర్ఖాలు ధరించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు. అన్ని మంచి బిల్లులకు వైసీపీ తమకు పార్లమెంట్‌లో మద్దతు ఇస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు అథవాలే.

Exit mobile version