NTV Telugu Site icon

Undavalli Arun Kumar: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. అది వైసీపీకి మైనస్‌..!

Undavalli

Undavalli

Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని జోస్యం చెప్పారు.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను.. కానీ, నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.. ఈ ఘటనను ప్రస్తావిస్తూనే.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయిన పేర్కొన్నారు.. నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ జగన్‌ను జైలుకు పంపడం వల్ల ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.. ఇలా అధికారంలో ఉన్న పార్టీలో సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటాయని చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

మరోవైపు.. రాష్ట్ర విభజనపై స్పందించిన ఉండల్లి.. నేడు రాష్ట్ర విభజన జరిగిన దుర్దినం.. కానీ, నేటికి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు.. దీనిపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఈనెల 22న విచారణ జరుగుతుందని వెల్లడించిన ఆయన.. తప్పు జరిగిన విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.. ఒప్పుకోకపోవడం వలనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు.. టీడీపీ అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదు.. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్ఇని కలవడానికి ప్రయత్నించిన ఇప్పటికీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉండల్లి అరుణ్ కుమార్‌. ఇంకా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తన ప్రెస్‌ మీట్‌లో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..