AP Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Skill Development Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై ఇవాళ బెజవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది.. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.. అయితే, సీఐడీ కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో భాస్కర్ ను విడుదల చేశారు సీఐడీ అధికారులు.. మరోవైపు సీఐడీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, సీఐడీ కోర్టు ఇచ్చిన అదేశాలు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం.. ఏసీబీ కోర్టును ఆశ్రయించారు భాస్కర్, ఆయన భార్య అపర్ణ..
Read Also: NTR: వైఫ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్…
Also Read
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులతో కలిసి సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3300 కోట్లకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని ఆరోపణలు భాస్కర్‌పై ఉన్నాయి.. ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యవయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా రూ. 371 కోట్ల భారం ఏర్పడింది. కానీ, సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం రూ. 58 కోట్లు అని బిల్లులు చేసి ఉంది. జీవీఎస్ భాస్కర్ ప్రాజెక్ట్ అంచనాలను తారుమారు చేసి రూ. 3300 కోట్లకు చేర్చాడని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.. సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెక్నాలజీ అందిస్తున్న పార్ట్ నర్ ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం వాటాను అందించాలని భావించారు. కానీ, భాస్కర్ మరికొందరు నిందితులు అప్పటి ప్రభుత్వ అధికారులతో కలిసి, అవగాహన ఒప్పందాన్ని తారుమారు చేయడానికి కుట్ర చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
తాజావార్తలు
-
Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!