Andhra Pradesh: గుంటూరు జిల్లా వైసీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను తక్షణమే విడుదల చేయాలని నిన్న (ఆగస్టు 7న) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, న్యాయస్థానం ఉత్తర్వులను రాత్రి 12 గంటల సమయంలో జైలు అధికారులకు తురకా కిషోర్ తరపున న్యాయవాది అందించారు. ఇక, మా పేరుతో రిలీజ్ కు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము విడుదల చేయలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు.
Read Also: Anupama Parameswaran : అనుపమ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ కు రెడీ
దీంతో వైసీపీ నేత తురక కిషోర్ కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాది ఒక్కసారిగా ఖంగుతిన్నారు. న్యాయస్థానం తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు పట్టించుకోకుండా.. కిషోర్ ను విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.