Site icon NTV Telugu

TTD Governing Body: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Yv Subba Reddy

Yv Subba Reddy

TTD Governing Body: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న ఆయన.. దాతలు అందించిన 10 లక్షల రూపాయల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామన్నారు.. పద్మావతి మేడికల్ కాలేజీలో టిబి విభాగం ఏర్పాటుకు 53.62 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.

Read Also: Bengaluru: ప్రియుడితో పుట్టినరోజు వేడుకులు.. రాత్రికి ప్రియురాలి హత్య

ఇక, అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణంకు రూ.18 కోట్లు.. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయిస్తూ టీడీపీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ది పనులుకు 4 కోట్లు కేటాయించగా.. టిటిడి విద్యా సంస్థలలో భోదన సిబ్బంది నియామకానికి అంగీకారం తెలిపింది.. ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మే 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.3.12 కోట్లు కేటాయించింది టీటీడీ.. జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులుకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ మార్పిడిపై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానను రద్దు చేయాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని పాలక మండలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version