TTD Governing Body: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Governing Body: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.. అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న ఆయన.. దాతలు అందించిన 10 లక్షల రూపాయల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామన్నారు.. పద్మావతి మేడికల్ కాలేజీలో టిబి విభాగం ఏర్పాటుకు 53.62 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
Read Also: Bengaluru: ప్రియుడితో పుట్టినరోజు వేడుకులు.. రాత్రికి ప్రియురాలి హత్య
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ఇక, అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణంకు రూ.18 కోట్లు.. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయిస్తూ టీడీపీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ది పనులుకు 4 కోట్లు కేటాయించగా.. టిటిడి విద్యా సంస్థలలో భోదన సిబ్బంది నియామకానికి అంగీకారం తెలిపింది.. ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మే 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.3.12 కోట్లు కేటాయించింది టీటీడీ.. జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులుకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ మార్పిడిపై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానను రద్దు చేయాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని పాలక మండలి సమావేశం నిర్ణయించిందని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!