Yv SubbaReddy: టీటీడీ పాలకమండలి సభ్యులకు గండం.. సుబ్బారెడ్డి నిర్ణయమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ పాలకమండలి సభ్యులకు పదవీ గండం ఏర్పడింది. చైర్మన్ భాధ్యతల నుంచి తప్పుకుని, యాక్టీవ్ పాలిటిక్స్ పై వెళ్లాలన్న వైవి సుబ్బారెడ్డి నిర్ణయం, సభ్యుల పాలిట శాపంలా మారుతోంది. చైర్మన్ పదవికి వైవీ రాజీనామా చేస్తే..పాలకమండలి పూర్తిగా రద్దవనుంది. అయితే తిరిగి పాలకమండలిలో తమకు చోటు దక్కుతుందా అని.. ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు సభ్యులు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకం. పాలకమండలిలో సభ్యత్వం కోసం పైరవీలు మాములుగా వుండవు. రాష్ర్ట పరిధులు దాటి, కేంద్ర నాయకత్వం నుంచి కూడా సిఫార్సులు రావడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంటోంది వ్యవహారం. ఎన్నడూ లేని విధంగా గత పాలకమండలి ఏర్పాటు సమయంలో 25 మంది సభ్యులతో పాటు మరో 50 మందిని ఆహ్వానితులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ, దేవాదాయశాఖ చట్టం మేరకు ఆహ్వానితులకు పాలకమండలిలో చోటు లేకపోవడం, ఈ అంశంపై కోర్టుకెక్కడంతో 50 మంది ఆహ్వానితుల నియామకం అటకెక్కింది. 2021 ఆగస్టులో టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియమితులైతే, సభ్యులను సెప్టెంబర్ చివర్లో నియమించింది. అయినా వారి పదవీ కాలం ఆగస్టు నుంచే లెక్కింపు మొదలైంది.
Also Read
పాలక మండలిలో ఏపి నుంచి ఏడుగురు అవకాశం లభిస్తే…మిగిలిన సభ్యులు ఇతర రాష్ర్టాలకు చెందిన వారే. ఒక దశలో పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేత రాజీనామ చెయ్యించి మరీ, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం. తరువాత నేర చరిత్ర కలిగిన వారికి పాలకమండలిలో సభ్యత్వం ఇచ్చారంటూ కోర్టుని ఆశ్రయించారు బిజేపి నేత భానుప్రకాష్ రెడ్డి. ఇక రెండు నెలలు క్రితం చీటింగ్ కేసులో పాలకమండలి సభ్యుడు లక్ష్మీనారాయణ అరెస్ట్ కావడంతో పదవికి రాజీనామా చేసారు. అతని స్థానంలో కొత్తగా దాసరి కిరణ్ కుమార్ ని సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం.
Read Also: Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట
పదవీ కాలం 8 నెలలే వున్నప్పటికి, సభ్యత్వం లభించడమే పదివేలు అన్నట్లుగా భావిస్తున్న సమయంలో వారికి షాక్ తగిలింది. మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ఎన్నికలు వుండటం.విశాఖ జిల్లాకు ఇంఛార్జిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.రాజకీయంగా బీజీ కావడంతో టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు సుబ్బారెడ్డి సిద్దమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. పదవి నుంచి సుబ్బారెడ్డి తప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం కూడా మొదలయ్యింది.
తదుపరి టీటీడీ చైర్మన్ ఎవ్వరంటూ చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అటు ఇటు కాకూండా పోతుంది మాత్రం పాలకమండలి సభ్యులే. దేవాదాయశాఖ చట్టం మేరకు ఛైర్మన్ తన పదవికి రాజీనామ చేస్తే…పాలకమండలి పూర్తిగా రద్దవుతుంది. దీంతో మరో 7 నెలల పదవీ కాలం వుండగానే, ప్రస్తుత సభ్యులు మాజీలుగా మారిపోతారు. కొత్త ఛైర్మన్ తో పాటు ప్రస్తుతం వున్న సభ్యులు తిరిగి నియమితులవడం దాదాపుగా అసాధ్యమే. ఇద్దరు, ముగ్గురు మినహాయిస్తే.. మిగిలిన వారికి మరోసారి చోటు దక్కే అవకాశమే లేదని తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో, ఈసారి పాలకమండలిలో రాష్ట్రవాసులకే ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలన్న భావనలో ప్రభుత్వ పెద్దలు వున్నారని సమాచారం. దీంతో పదవీ కాలాన్ని పూర్తిగా అనుభవించ కుండానే మాజీలుగా మారిపోనున్నారు ప్రస్తుత పాలక మండలి సభ్యులు.
Read Also: Womens IPL: విమెన్స్ ఐపీఎల్లో ఒక్కో ఫ్రాంచైజీకి 600 కోట్లు!
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!