NTV Telugu Site icon

TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. రూ.3500 కోట్లతో వార్షిక బడ్జెట్‌..!

Yv Subba Reddy

Yv Subba Reddy

TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ రోజు సమావేశం కాబోతోంది.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు.. వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.. ఇక, రూ.3,500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు.. ఇక, అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనుంది టీటీడీ.. లడ్డూ పోటు యాంత్రికరణ అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడులోని ఉల్లందురుపేట, యానంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి. లడ్డూ కౌంటర్ల పెంపుదలపై నిర్ణయం తీసుకోబోతోంది టీటీడీ.

Read Also: Lay Foundation Stone For Steel Plant: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్‌.. స్టీల్‌ ప్లాంట్‌కు భూమి పూజ…

కాగా, తిరుపతి సమీపంలోని అలిపిరి – చెర్లోపల్లి మార్గంలో తలపెట్టిన స్పిరిచ్యువల్ సిటీలో దాదాపు 50 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేవిధంగా వసతిగృహ సముదాయం నిర్మించే విధంగా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. అలాగే తమిళనాడులోని ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి రూ.4 కోట్లు, యానాంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులను మంజూరుకు ఆమోదం తెలపనున్నారు.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాల పంపిణీకోసం మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 8 కాటేజీల పునర్నిర్మాణం కోసం ఈ టెండర్ విధానంపై చర్చించనుంది టీటీడీ పాలకమండలి..