Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

‘‘వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు’’.. ఉగ్రవాది మసూద్ అజార్ వణికించే ప్రకటన..

పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. మసూద్ అజార్‌ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్‌పై దాడులు చేసేందుకు వీరంతా కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.

అజిత్ దోవల్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఎందుకు వాడరు.?

భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిద్ దోవల్ తన రోజూవారీ పనుల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించనని వెల్లడించారు. ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక యువకుడు.. ‘‘మీరు నిజంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరా?’’ అని దోవల్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఇంటర్నెట్ వాడను, మొబైల్ ఫోన్ కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తాను. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సినప్పుడు లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడుతాను’’ అని చెప్పారు.

ఆత్రేయపురంలో నోరూరించే గోదావరి రుచులు.. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్‌..!

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలు, నోరూరించే పిండివంటలతో ఈ ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. పండగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న పర్యాటకులతో ఆత్రేయపురం సందడిగా మారింది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ ‘ఆత్రేయపురం పూతరేకులు’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పూతరేకులను ఇక్కడ ప్రత్యేక స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా , బెల్లం పొడితో తయారు చేసిన ఈ పూతరేకుల కోసం పర్యాటకులు క్యూ కడుతున్నారు. వీటితో పాటు నెయ్యిలో దోరగా వేయించిన నేతి బొబ్బట్లు, సున్నుండలు, బెల్లం గవ్వలు , కారం గవ్వల సువాసనలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్రధాని మోడీ దేశానికి అజేయమైన రక్షణ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ’’ ఉందని అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగించిన అంబానీ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థిలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం భారతీయులపై పడలేదని, భారతదేశానికి నరేంద్రమోడీ అజేయమైన రక్షణ గోడ ఉంది’’ అని అన్నారు.

బంగ్లాదేశ్ ఘటనలు మనకు హెచ్చరిక.. లౌకికవాదుల హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు..?

కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్‌ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్‌లోని మాఘ మేళాలో కార్యక్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు. లౌకివాదం పేరుతో దుకాణాలు నడుపుతున్న వ్యక్తులు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తు్న్నారు. సనాతన ధర్మాన్ని విడదీయాలని అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ సంఘటనల విషయానికి వస్తే వారి నోళ్లు ఫెవికాల్‌, టేప్‌తో మూతపడినట్లు ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ సంఘటనలపై కనీసం కొవ్వత్తుల ప్రదర్శన కూడా చేయలేదు. ఇది మనకు హెచ్చరిక’’ అని అన్నారు.

ఈ దేశంలో పురుషులందరూ బానిసలే..

చాలా దేశాలలో కొందరు మహిళలను బానిసలుగా చూస్తారని తెలుసు. అక్కడ జీవించే మహిళలకు వారి ప్రాథమిక హక్కులు కూడా నిరాకరిస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగాయి కానీ పురుషులపై కాదు. కానీ ఒక వింతైన దేశం గురించి మీకు చెబితే నమ్ముతారా? ఆ దేశంలో కేవలం మహిళలు మాత్రమే పరిపాలిస్తారని ఊహించుకోగలరా. వాస్తవానికి ప్రపంచంలో స్త్రీలు పురుషులను పరిపాలించి వారిని బానిసలుగా ఉంచుకునే దేశం ఉంది. ఈ దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రేపు సుప్రీం కోర్టులో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై విచారణ..!

పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ, రాష్ట్రం తరపున ఎక్కడా రాజీ పడకుండా బలమైన వాస్తవాలను కోర్టు ముందుంచాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను , సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు.

హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ODI క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ODIలలో ఓపెనర్‌గా క్రిస్ గేల్ మొత్తం 328 సిక్సర్లు (274 ఇన్నింగ్స్‌లలో) కొట్టాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును అధిగమించాడు. అతను 329 సిక్సర్లు కొట్టి, ODI క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నయా చరిత్రను లిఖించాడు.

సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేసిన వెంటనే ఈ స్టార్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచి నయా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (624) ఈ ఘనతను సాధించాడు. విరాట్ 309 వన్డే మ్యాచ్‌లలో 14,600 పరుగుల మార్కును దాటాడు. ఇందులో 53 సెంచరీలు, 77 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ప్రేమ కోసం.. లండన్ నుంచి వచ్చి తల్లిని చంపిన కొడుకు..

హర్యానాలో మహిళ హత్య సంచలనంగా మారింది. పోలీసుల విచారణ తర్వాత విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యమునా నగర్ జిల్లాలో జరిగిన మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. గొడవల కారణంగా కన్న కొడుకే హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ హత్యకు అతడి స్నేహితుడు సహకరించనట్లు గుర్తించారు. శ్యాంపూర్ గ్రామ సర్పంచ్‌ భార్య బల్జీందర్ కౌర్‌ డిసెంబర్ 24 రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. హత్య కేసు విచారణ కఠినంగా మారడంతో దీనిని క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

 

Exit mobile version