చొరబాటుదారుల్ని దేశం నుంచి తొలగిస్తాం.. బీహార్ నుంచే ప్రారంభిస్తామన్న అమిత్ షా
చొరబాటుదారుల నుంచి విముక్తి అంటే కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదని.. భారత నేల నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుడిని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్‌లోనే సీమాంచల్ ప్రాంతంలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సీమాంచల్ నుంచే చొరబాటుదారులను ఏరివేస్తామని వెల్లడించారు. ‘‘ఈ రోజు భారత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్ధంతి. వీర్ సావర్కర్ స్వాతంత్ర్య పోరాటంలో అసమాన యోధుడు మాత్రమే కాదు. అపారమైన శక్తిని ప్రదర్శించిన నిర్భయ దేశభక్తుడు కూడా. తన సాహిత్యం ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించారు. ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబించే నాయకుడు… అంటరానితనాన్ని నిర్మూలించినా, భాషల శుద్ధి చేసినా, స్వచ్ఛమైన జాతీయవాద దృక్పథమైనా.. వీర్ సావర్కరే వీటన్నింటికీ అపారమైన కృషి చేశారు. తన మరణం వరకు అలాగే కొనసాగారు. ఈ రోజు మొత్తం దేశం తరపున మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌కు నా హృదయపూర్వక నివాళులు అర్పించాలనుకుంటున్నాను.’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
“చచ్చిపోతామనుకున్నాం.. కానీ!”.. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుల ఆవేదన..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భవనంలో షాపింగ్ మాల్ సిబ్బంది చిక్కుకోగా వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వారిని రక్షించారు. పై ఫ్లోర్లో కార్మికులు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎలివేషన్ కట్టడంపై పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు అదుపులోకి వచ్చాయి.. ఇందులో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అగ్ని ప్రమాద సమయంలో మూడో అంతస్తులో మహిళలు పని చేస్తున్నారు. ఐదో అంతస్తులో నలుగురు కార్మికులు పని చేస్తున్నారు.. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మహిళలు అరుపులు, కేకలు పెట్టారు. ఐదవ అంతస్తులో ఉన్న ఒక మహిళ భర్త రాజు మూడో అంతస్తుకు వచ్చాడు. మూడవ అంతస్తులోని అద్దాలను పగలగొట్టాడు రాజు.. భవనం వెనుక పై వైపు నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు.. అద్దాలను పగల కొట్టడంతో నిచ్చెన సాయంతో కిందికి వచ్చారు మహిళలు. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికుడు రాజు ఈ అంశంపై ఎన్టీవీతో మాట్లాడారు. “మొదటి అంతస్తులు తాపీ పని చేయడానికి నాతోపాటు మరో ముగ్గురు వచ్చారు.. నాలుగో ఫ్లోర్లో ఆ సెట్టింగ్ తీసేయడానికి మరొక నలుగురు వచ్చారు.. 10:30కు ఒకసారిగా పొగలు ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాయి.. నల్లటి పొగ రావడంతో ఎటుపోవాలని తెలియలేదు .. సచ్చిపోతామని అనుకున్నాము.. నాలుగో ఫ్లోర్ వరకు వెళ్ళాం.. నాలుగో ఫ్లోర్‌కు పోయే సరికి నల్లటి పొగ ఎక్కువగా వచ్చింది.. మొత్తం నల్లటి పొగ ఉండటంతో ఎటు వెళ్ళాలో తెలోయలేదు.. సెట్టింగ్ తొలగించడానికి వచ్చిన నలుగురు పక్క బిల్లింగ్ పైకి దూకి వెళ్లిపోయారు.. మాతో పాటు వచ్చిన మరొక ముగ్గురు నేను కలిసి గ్లాస్ డోర్ పగలగొట్టుకొని వచ్చాం.. చచ్చిపోతామని అనుకున్నాం.. ఎలాగోలా బతికాం..” అని వెల్లడించారు.
తొమ్మిది దేశాల్లో ‘ఆయా షేర్’ హవా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ద ప్యారడైజ్’ (The Paradise). అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు పెంచేసిన ‘ద ప్యారడైజ్’ సినిమా, ఇప్పుడు తన మొదటి పాటతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్’ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేస్తోంది. తెలుగు సినిమా పాటలు గ్లోబల్ లెవల్‌లో ట్రెండ్ అవ్వడం చూస్తుంటాం, కానీ ‘ఆయా షేర్’ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ మరియు యూఏఈ దేశాల్లో ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా (USA), యూకే (UK), ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ సాంగ్ టాప్ ర్యాంక్స్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం నంబర్లు మాత్రమే కాదు, ఈ పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాని స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేల మీద చేసే ఆ ‘ఫ్లోర్ మూవ్’కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ ఈ స్టెప్‌ను రీ-క్రియేట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
భారత్ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!
టీ20 వరల్డ్‌కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం టాప్ జట్లు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉండటంతో.. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశాలు నాలుగు ఉన్నాయి. అయితే అందులో ఒక సినారియో మాత్రమే సూర్య సేనకు అనుకూలంగా ఉంది. మిగతా మూడు అదృష్టం అనే చెప్పాలి.
ఢిల్లీలో ఓ ఇంటిపై నకిలీ ఈడీ అధికారుల దాడి.. భారీగా నగదు అపహరణ
దేశ రాజధాని ఢిల్లీలో వింతైన సంఘటన జరిగింది. నకిలీ ఈడీ అధికారులుగా నటిస్తూ ఇల్లును కొల్లగొట్టారు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో ఒక ఇంటి పనిమనిషి.. యజమాని ఇంటినే దోచుకోవాలని పన్నాగం పన్నింది. అంతే ‘ స్పెషల్ 26’ సినిమాలో మాదిరిగా స్నేహితులతో కలిసి దోపిడీకి ప్రణాళిక రచించింది. ఇంట్లో గుట్టంతా స్నేహితులకు తెలియజేసింది. ఇంకేముంది పోలీస్ యూనిఫామ్‌లు ధరించి ఇంటి లోపలికి ప్రవేశించి ఖరీదైన గృహోపకరణాలు, నగదు దోచుకున్నారు. దాదాపు రూ.4 లక్షల నగదు. విలువైన గడియారాలు పట్టుకుపోయారు.
ఆ రెండు విషయాలు లేవనెత్తుతాననే లోక్‌సభలో మాట్లాడనివ్వలేదు
ట్రంప్ బెదిరింపులతోనే అమెరికాతో ప్రధాని మోడీ వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళంలోని కన్నూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘అమెరికన్ రైతులు భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్న, పండ్లను అమ్మడానికి అనుమతించడం ఏ భారతీయ ప్రధానమంత్రి కూడా ఇలా అనుమతించరు. భారతదేశ పునాదిని బీజేపీ నాశనం చేయబోతోంది. 4 నెలలుగా భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయింది. భారత ప్రభుత్వం.. అమెరికన్ కంపెనీలకు భారత వ్యవసాయాన్ని తెరవడానికి ఇష్టపడలేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్.. ప్రధానమంత్రి మోడీని బెదిరించారు. దీంతో లొంగిపోయారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై వారు నన్ను మాట్లాడనివ్వలేదు. అమిత్ షా లేచారు. ప్రధానమంత్రి మోడీ నన్ను మాట్లాడనివ్వలేదు. స్పీకర్ కూడా అదే చేశారు. భారత చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనివ్వలేదు. వారు నన్ను ఎందుకు ఆపారు? ఎందుకంటే భారత ప్రధాని మోడీ చిక్కుకున్న రెండు సమస్యల గురించి నేను మాట్లాడబోతున్నానని వారికి తెలుసు. ఎప్‌స్టీన్ ఫైల్స్, అమెరికాలో అదానీ కేసు గురించి.’’ అని అన్నారు.
బికినీ బేబీలతో స్టీఫెన్ హాకింగ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం..
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా, అమెరికా రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. లైంగిక నేరస్తుడు జేఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఫైల్స్ లో వచ్చింది. తాజాగా ఆయన ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మహిళలు బికినీలో స్మిమ్మింగ్ ఫూల్ వద్ద ఉండగా, వీరిద్దరి మధ్య స్టీఫెన్ హాకింగ్ సన్ లాంజర్‌పై ఉన్నారు. వీరి చేతుల్లో కాక్‌టెయిల్ డ్రింక్స్ ఉన్నాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఫోటో 2006లో సెయింట్ థామస్‌లోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌లో జరిగిన సైన్స్ సింపోనియం సందర్భంగా తీసిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో హాకింగ్ క్వాంటం కాస్మోలజీపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఎప్‌స్టీన్‌కు చెందిన 75 ఎకరాల ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన 21 మంది శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.
రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!
అనిల్ అంబానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందర విచారణకు హాజరయ్యారు. గురువారం ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనను మనీ లాండరింగ్ కేసులో రెండోసారి ప్రశ్నిస్తున్నారు. రూ. 40,000 కోట్ల భారీ బ్యాంకు మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) సంస్థకు సంబంధించినది. బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాలను విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ED అనుమానిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద అధికారులు అంబానీ స్టేట్‌మెంట్ ను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 2025 ఆగస్టులో ఒకసారి విచారణకు హాజరైన ఆయనను ఇప్పుడు రెండోసారి ప్రశ్నించడం గమనార్హం. ఈ కేసులో భాగంగా RCOM మాజీ అధ్యక్షుడు పునీత్ గార్గ్ ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు.
ఎక్కడ కూల్చేశారో.. అక్కడే గృహప్రవేశం చేయిస్తాం..
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెండు రోజుల క్రితం రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్‌ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, తమకు గూడు లేకుండా చేసిందని వారు కేటీఆర్‌కు వివరించారు. బాధితుల మాటలను ఓపికగా విన్న ఆయన, వారికి ధైర్యం చెప్పారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త..!
శ్రీవారి భక్తులు తిరుమల దర్శనం , వసతి గదుల కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన విధంగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘాను ముమ్మరం చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ పేరుతో గదులు ఇప్పిస్తామన్న నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, గూగుల్ సెర్చ్‌లో టీటీడీ పేరుతో కనిపిస్తున్న పలు ఫేక్ లింకులు భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ వెబ్‌సైట్లలో టీటీడీ లోగోలు, శ్రీవారి ఆలయ చిత్రాలను అనధికారికంగా వాడుతూ భక్తులను నమ్మిస్తున్నారని తేలింది.
