ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది
భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు భారతీయుల కల నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈరోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, వీహెచ్‌పీ నేత దాల్మియా, అనేక మంది సాధువులు, ప్రజలు, విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ నిర్మాణం కోసం ఎంతో మంది ఆశతో ఎదురుచూశారని.. వారి సంకల్పం నేటితో నెరవేరిందని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును వ్యాపింపజేసిన రామరాజ్య ‘ధ్వజం’ ఇప్పుడు శిఖరంపై కూర్చుందని తెలిపారు. ధ్వజం అనేది ఒక చిహ్నం అని చెప్పారు. 500 సంవత్సరాల కల ఇన్నాళ్లకు నెరవేరిందని తెలిపారు.
“వందేమాతరం” గీతానికి అవమానం.. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట..
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో గొడవవ సర్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు.. మేయర్ అంగీకారం తెలిపి.. అందెశ్రీకి నివాళికి చిహ్నంగా జయజయహే తెలంగాణ కూడా పాడుదాం అని కోరారు.. అయితే దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది..
యువతితో అసభ్య నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్!
అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జుబీన్ గార్గ్ మరణంపై అసెంబ్లీలో సీఎం హిమంత కీలక ప్రకటన
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై ముఖ్యమంత్రి హిమంత శర్మ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్‌ది నేరపూరిత కుట్రగా తేల్చారు. జుబీన్ గార్గ్ ప్రమాదంతో చనిపోలేదని.. హత్య గావించబడ్డారని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపాదించిన వాయిదా తీర్మానంలో ముఖ్యమంత్రి హిమంత శర్మ క్లారిటీ ఇచ్చారు. జుబీన్ గార్గ్‌ను ఒకరు హత్య చేస్తే.. కొందరు అతనికి సహాయం చేశారని వెల్లడించారు. హత్య కేసులో నలుగురైదుగురు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాక.. రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరం వెనుక ఉన్న ఉద్దేశం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇక సింగపూర్ పోలీస్ ఫోర్స్ (SPF) కూడా స్వతంత్ర దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు.
కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం.. మేరీ మాత అలంకరణపై భక్తుల ఆగ్రహం
ముంబై కాళీమాత ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. కాళీమాత విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని చెంబూర్‌లో కాళీమాత విగ్రహం ఉంది. అయితే ఎప్పుడూ కాళీమాత రూపంలో ఉండే విగ్రహం ఒక్కసారిగా మేరీ మాత రూపంలో కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. గర్భగుడిలో మేరీ మాత పోలిన దుస్తులు ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక భక్తులు పూజారి రమేష్‌ను నిలదీయగా తిక్క సమాధానం ఇచ్చాడు. తనకు కలలో కాళీమాత కనిపించి.. తనకు మేరీ మాత రూపాన్ని ఇవ్వమని అడిగిందని చెప్పుకొచ్చాడు. దీంతో భక్తులకు మరింత కోపం తెప్పించింది. కొంత మంది స్థానికుల సాయంతో పూజారి ఈ పని చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూజారి రమేష్‌ను అరెస్ట్ చేశారు.
ప్రాణాంతక ఆయుధం తయారీకి భారత్ సిద్ధం.. పాక్ గజగజలాడాల్సిందే!
దేశంలో హామర్ స్మార్ట్ బాంబును తయారు చేయడానికి ఇండియాకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్ (సఫ్రాన్) అధికారికంగా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై BEL.. CMD మనోజ్ జైన్, సఫ్రాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకం చేశారు. గతంలో ఫిబ్రవరి 2025లో ఏరో ఇండియా సందర్భంగా రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నేడు ఆ ఒప్పందం జాయింట్ వెంచర్ కంపెనీ (JVC) ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. కొత్త కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంటుంది. ఇందులో BEL – సఫ్రాన్ 50% వాటాలను సమానంగా కలిగి ఉండనున్నాయి.
నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను
సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు.
నన్ను టార్గెట్ చేస్తే, దేశాన్ని షేక్ చేస్తా.. బీజేపీకి మమతా వార్నింగ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు. బీహార్‌లో బీజేపీ ఆట ఆడిందని మమతా బెనర్జీ ఆరోపించింది. బెంగాల్‌లో సర్ జరగకూడదని ఆమె అన్నారు. బెంగాల్‌లో తనను, తనను ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే తాను దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి మొత్తాన్ని దేశాన్ని కదిలిస్తానని ఆమె బీజేపీని హెచ్చరించింది. ‘‘బెంగాల్‌లో మీరు నన్ను లక్ష్యంగా చేసుకుని, నా ప్రజలపై జరిగే దాడిని వ్యక్తిగత దాడిగా భావిస్తే, నేను మొత్తం దేశాన్ని కదిలిస్తాను. ఎన్నికల తర్వాత నేను మొత్తం దేశాన్ని తిరుగుతాను’’ అని ఆమె అన్నారు.
24 కోట్లు.. 127 అకౌంట్లు.. వెలుగులోకి మరో భారీ మోసం..!
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి ఈ ముఠా ప్రధాన నిందితుడని బయటపడింది.
ఆ ఒక్క మెయిల్ రవిని పట్టించింది.. సంచలన విషయాలు చెప్పిన పోలీసులు
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్‌లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది. అడిషనల్ సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. రవిని పట్టుకునేందుకు అతని స్నేహితుడు నిఖిల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఐబొమ్మ, బప్పమ్ మూవీ పోస్టర్లను నిఖిల్ తయారు చేస్తుండడంతో, అతని ద్వారా రవికి దగ్గరగా చేరిన పోలీసులు అతడిని జాగ్రత్తగా ట్రాప్ చేశారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనల ద్వారా రవికి భారీ స్థాయిలో డబ్బులు వచ్చేవి. ఈ డబ్బును రవి తన పేరుతో నడుపుతున్న యాడ్ బుల్ అనే కంపెనీకి మళ్లించాడు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో విదేశీ ట్రాన్సాక్షన్లు జరిగేవని సీపీ తెలిపారు.
