పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’
పవన్ కళ్యాణ్. టాలీవుడ్‌లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా జనాల మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను వేసుకున్నారు.
నన్ను అయితే బతకనిచ్చేవాళ్లే కాదు.. శివాజీ కామెంట్స్‌పై వేణు స్వామి రియాక్షన్
టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై జ్యోతిష్యుడు వేణు స్వామి తనదైన శైలిలో స్పందించారు. ‘శివాజీ లాగా నేను మాట్లాడి ఉంటే ఈపాటికి నన్ను జైల్లో వేసేవారు, మీడియా ఛానల్స్ నన్ను ఊరూరా టార్గెట్ చేసేవి. అవసరమైతే ఐక్యరాజ్యసమితిని కూడా రంగంలోకి దించి నన్ను బతకనిచ్చేవారు కాదు’ అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం పై జాతకం చెబితేనే తనను ఎంతో టార్గెట్ చేశారని, ఇక్కడ అందరికీ ఒకే రకమైన న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. అంతే కాదు సెలబ్రిటీల జీవితాల గురించి చెబుతూ ఆయన కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సీఎం చంద్రబాబు పీ4ని తీసుకొచ్చారు..
ఒంగోలులో పీవీఆర్ స్కూల్ శతజయంతి ఉత్సవాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నీ దానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పది.. అన్నదానం ఒకరు మాత్రమే ఆకలి తీర్చుతుంది.. విద్యాదానం వ్యక్తి ఆకలితో పాటు వ్యవస్థను కూడా సరి చేస్తోంది.. నెల్లూరులో ప్రైవేటు స్కూల్ కు ధీటుగా మంత్రి నారాయణ వీఆర్సీ పాఠశాలను నిర్మించారు.. అన్నీ ప్రభుత్వాలే చేసే వరకు ఎదురు చూడక.. వ్యక్తులు కూడా సమాజాభివృద్ధికి చొరవ చూపాలి.. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యావ్యవస్థ బలోపేతం అవుతుంది అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
భారీ సైబర్ క్రైమ్ కేసును ఛేదించిన పోలీసులు.. రూ.547 కోట్లను కొల్లగొట్టిన కేటుగాళ్లు
ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్ ద్వారా 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిందితులు. సైబర్ క్రైమ్ లో సత్తుపల్లి,కల్లూరు,వేంసూర్ మండలానికి చెందిన ఆరుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోట్రు మనోజ్ కళ్యాణ్,ఉడతనేని వికాస్ చౌదరి,పోట్రు ప్రవీణ్,మేడ భానుప్రియ, మేడా సతీష్,మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ లో వి ఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ కేసు వెలుగు చూసింది. నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు.. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడ్డారు నిందితులు.. మ్యాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
‘ది వాల్’ ద్రవిడ్ రేర్ రికార్డులు.. ఈ ఐదు ఎవరికీ సాధ్యం కాదేమో?
భారత మాజీ కెప్టెన్, ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు నేడు (జనవరి 11). ఈరోజుతో ఆయనకు 53 ఏళ్లు నిండాయి. ద్రవిడ్ తన టెక్నిక్, సహనం, క్లాసిక్ బ్యాటింగ్ కారణంగా ‘ది వాల్’గా బిరుదు అందుకున్నారు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ద్రవిడ్‌ను అవుట్ చేయడం బౌలర్లు తలకు మించిన భారంగా ఉండేది. ఆటగాడిగానే కాదు.. కోచ్‌గా కూడా సక్సెస్ అయ్యారు. భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఆటగాడిగా ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొట్టలేని అనేక రికార్డులను సృష్టించారు. అందులో ఐదు రికార్డులను పరిశీలిద్దాం.
ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మరోవైపు, నిరసనల్ని అణిచివేసేందుకు మతప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ ‘‘పెద్ద ఇబ్బందుల్లో’’ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇరాన్ పెద్ద ఇబ్బందుల్లో ఉంది. కొన్ని వారాల క్రితం నిజంగా సాధ్యమేనా అని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని నగరాలను ప్రజలు స్వాధీనం చేసుకున్నట్లు నాకు అనిపిస్తోంది’’ అని ట్రంప్ అన్నారు.
విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన నాయగన్ సినిమా గురించి, దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాస్ట్ సినిమాకు తనకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “విజయ్ గారు తన చివరి చిత్రానికి నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. భగవంత్ కేసరి చిత్రంపై ఆయనకు గట్టి నమ్మకం ఉంది. గతంలో ఈ సినిమా రిమేక్ చేయాలని తన దగ్గరకు వచ్చినప్పుడు.. విజయ్ గారితో స్ట్రైట్ సినిమా చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది విజయ్ గారి లాస్ట్ ఫిల్మ్, అందులోనూ రిమేక్ అంటే ఎలా ఉంటుందో అనే భయం ఉండింది. అందుకే ఈ సినిమాను డైరెక్ట్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ ఈ సినిమా విజయ్ గారికి బాగా నచ్చింది. అందుకే ఆయన ఈ సినిమాను పట్టుబట్టి రిమేక్ చేశారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా అన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు” అని నమ్మకంగా అన్నారు.
రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు కూలగొట్టే వ్యక్తి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ మంత్రులైన వివేక్ వెంకటస్వామి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, , పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పేదవాడి ఇళ్లను కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లకు వచ్చేసరికి వెనకాడుతున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి” అంటూ ఆయన విమర్శించారు.
థియేటర్లలో కాదు.. సచివాలయంలోనే ‘సస్పెన్స్ థ్రిల్లర్’ నడుస్తోంది
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద ‘సస్పెన్స్ త్రిల్లర్’ సినిమా నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న గందరగోళాన్ని ఆయన ఎండగట్టారు. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ఒకవైపు ప్రభుత్వం జీవో (GO) జారీ చేస్తుంటే, మరోవైపు సంబంధిత సినిమాటోగ్రఫీ మంత్రి తనకు ఈ విషయం తెలియదని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. “సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికే తెలియకుండా ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా జరిగిపోతుంది?” అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రికే సమాచారం లేకపోతే, అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరని ఆయన నిలదీశారు.