Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

*గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..ఇవాళ విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్న సీఎం వైయస్‌ జగన్‌

* ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం.. దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

* ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు

*గుంటూరులో నేటినుంచి మూడు రోజులపాటు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

*తిరుపతిలో 8వతేదీ నుండి పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు

*తిరుపతి పుదిపట్లలో పరమవీర చక్ర అవార్డు గ్రహీత యోగేంద్ర సింగ్ యాదవ్, అయోధ్య హనుమాన్ ఆలయ పీఠాధిపతి శ్రీ కళ్యాణ్ దాస్ మహారాజ్ లకు సన్మానం

*కాకినాడ రానున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీ వీ ఎల్ నరసింహరావు..పార్టీ సమావేశంలో పాల్గొననున్న ఎం పీ జీవీఎల్

*విశాఖలో నటుడు తనికెళ్ళ భరణికి ఆంధ్రా జ్ఞాన పీఠిక అవార్డు ప్రదానం.. లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా సన్మానించనున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

*విశాఖలో గురుపూజోత్సవం వేడుకలు.. వీ.ఎం. ఆర్.డీ.ఏ. చిల్డ్రన్ థియేటర్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

*విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా

*నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయంలో మూలానక్షత్ర పూజలు

Exit mobile version