* ఇవాళ విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన, సభకు అధ్యక్షత వహించనున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్… 40 నిముషాలు ప్రసంగించనున్న ప్రధాని…..ముఖ్యమంత్రికి ఏడు నిముషాల సమయం కేటాయింపు
*విశాఖ పర్యటనలో బహిరంగ సభ నుంచి 10వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్రమోడీ…
* నేడు విశాఖలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్….పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం….నిన్న ప్రధానమంత్రితో అరగంట పాటు భేటీ….రాష్ట్రంలో పరిస్థితులు వివరించానన్న పవన్….రేపు విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటన
* నేడు ప్రధాని చేతుల మీదుగా భద్రాచలం – సత్తుపల్లి రైల్వే లైన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం, రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
*మెదక్ కలెక్టరేట్ లోని ల్యాండ్ సర్వే కార్యాలయంలో నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న ACB సోదాలు.. నిన్న రాత్రి రైతు నుంచి 30 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన AD గంగయ్య
*గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం
*మోదీ బహిరంగ సభ ప్రధాన వేదికపై నలుగురికే అవకాశం….ప్రధాని,ముఖ్యమంత్రి, గవర్నర్, రైల్వే మంత్రి మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు
*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
* అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి వేణుగోపాల్
*తమిళనాడులో భారీ వర్షాలు, ఇవాళ పలు జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్ళకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
* ఇవాళ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్.. భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ