*నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మనోహరాబాద్ లో ఐటిసి ఫుడ్ పరిశ్రమను ప్రారంభించనున్న కేటీఆర్
*ఈనెల 31న కమలాపురంలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్… కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు
*శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇస్కలపేట వద్ద ఉన్న బలసలరేవు పరిశీలించనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. బలసలరేవు వంతెన నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ
* ఇవాళ కేంద్రమంత్రి వర్గ భేటీ.. కేంద్ర బడ్జెట్, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించే అవకాశం
* రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విపక్షాలతో విడివిడిగా భేటీ కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
* ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. వినుకొండలోని వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సిఎం జగన్
* శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పర్లాం, మాకివలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
*నేడు రాజమండ్రిలో హరిత- యువత కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం.. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్, ఎంపీ మార్గాని భరత్ రామ్ సంయుక్తంగా విద్యార్థులతో చేపట్టిన కార్యక్రమం.
*పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ పరిధిలో 6,7 వార్డులలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
*నంద్యాల జిల్లా టెక్కేలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నేడు నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
*ఏపీ హైకోర్టులో ఇవాళ ఎల్.జి. పాలిమర్స్ ఘటనపై దాఖలైన పిల్ పై హైకోర్టులో విచారణ… ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ప్రభుత్వం
*నేడు పశ్చిమగోదావరి జిల్లా సమ్మిశ్రగూడెంలో జిల్లా పరిషత్ పాఠశాల భవనం ఇతర అవసరాలకు వినియోగించడంపై వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.హైకోర్టుకు హాజరు కావాలని అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, ప్రస్తుత సీఎంఓ అదనపు సెక్రెటరీ ముత్యాలరాజుకు ఆదేశాలు.
*నేడు తారకరత్న కు మరోసారి కీలమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్న NH వైద్యులు.నేడు తారకరత్న వైద్య సహాయం కోసం మరికొద్దిమంది స్పెషలిస్టు డాక్టర్ బృందం
*నేడు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారికి పూజలు చేయనున్న హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ
*నేటి నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు భీమడోలు రైల్వే గేటు మూసివేత ..రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం గేటు మూసివేయనున్న రైల్వే అధికారులు
*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ