Today Events February 21, 2023
*నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవాలు
*శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిడిమాను ఉత్సవం
*గుంటూరు ఈనెల 26 నుండి మార్చి 9 వరకు 12 రోజుల పాటు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
*నేడు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి అధ్యక్షతన 107 అంశాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న అధికారులు
*అనంతపురంలో ఈనెల 22 న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం. హాజరు కానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*నెల్లూరులోని ఇందిరా భవన్ లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పై నేతలతో సమావేశం కానున్న పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ఏఐసిసి కార్యదర్శి మయ్యప్పన్
*వెంకటగిరిలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్న నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
*అన్నమయ్య జిల్లా లక్కీ రెడ్డి పల్లె మండలం అనంతపురంలో నేడు గంగమ్మ జాతర..పెద్దఎత్తున హాజరు కానున్న భక్తులు
*కాకినాడలో నేడు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థలు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కుడుపూడి సూర్యనారాయణ
*నేటి నుంచి యానాంలో మీసాల వెంకన్న కళ్యాణోత్సవాలు… ఉదయం పూజా కార్యక్రమాలతో పెండ్లి కుమారుడి ఉత్సవాలు…సర్పవాహనంపై ఊరేగనున్న స్వామి వారు
*మార్చి 1వ తేదీనుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనున్న టీటీడీ..సర్వదర్శనం,లడ్డు కౌంటర్లు,గదులు కేటాయింపు,రిఫండ్ కౌంటర్లు వద్ద నూతన టెక్నాలజిని అమలు చెయ్యనున్న టీటీడీ..ఫేస్ రికగ్నిషన్ విధానంలో అక్రమాలకు చెక్ పడడంతో పాటు భక్తులకు సులభతరంగా సేవలు అందించవచ్చునంటున్న టీటీడీ