అనంతపురంలో సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతిలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌తో కలిసి పులివర్తి నాని మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. అనంతపురం సభపై జగన్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. జగన్ మానసిక స్థితి బాగోలేదు. ఏపీలో యూరియా కొరతకు కారణం వైసీపీనే. ప్రభుత్వాన్ని నిత్యం దూషించే బదులు జగన్ నడి సముద్రంలో దూకాలి. ఐదేళ్ళు జగన్ ఏపీలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. అబద్ధాలతో జగన్ కాలం గడుపుతున్నారు. మెడికల్ కళాశాలలను కట్టేశామని జగన్ అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్షపూరితంగా వ్యవహరించడం లేదు.’’ అని పులవర్తి నాని అన్నారు.
ఇది కూడా చదవండి: Pardha Saradhi: సూపర్ సిక్స్ సభ హిట్ అవ్వడంతోనే జగన్ ఓర్వలేక విమర్శలు
మురళీమోహన్..
‘‘పెట్టుబడిదారులను జగన్ బెదిరించిన తీరు సరైంది కాదు. జగన్ వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు. జగన్ పగటి కలలు మానుకోవాలి. 217 మందిని నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సురక్షితంగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తోంది. నేపాల్‌లో చిక్కుకుపోయిన వారిని నారా లోకేష్ సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సొంత పత్రికలో పిచ్చి రాతలు రాస్తున్నారు. సూపర్ సిక్స్ సభపై సొంత పత్రికలో అసత్యాలను రాశారు. వైసీపీ హయాంలో ఎస్సీలపైనే కేసులు పెట్టి జైలుకు పంపించారు. అక్రమ కేసులు పెడుతున్నామంటూ జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.’’ అని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు.
ఇది కూడా చదవండి:Ramchander Rao : ఖర్గే మాటలు చూస్తే నవ్వొస్తుంది.. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది
