Site icon NTV Telugu

RK Roja: తిరుమల మెట్లు అన్నీ కడగండి.. పవన్‌ కల్యాణ్‌కు రోజా సూచన

Roja

Roja

RK Roja: టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టెంపుల్ సిటీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. వైసీపీ ఆందోళనలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేవుడితో పెట్టుకోవద్దు.. దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుందో.. ఇప్పటికే చంద్రబాబు చూశారు.. ఈ మధ్యే పవన్‌ కల్యాణ్‌కు కూడా తెలిసివచ్చిందన్నారు.. అయితే, ప్రభుత్వాన్ని తానే నిలబెట్టానని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం చేసే తప్పుల్లో కూడా భాగస్వామ్యం ఉందన్నారు.. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈరోజు తిరుమలలో ఎన్నో అపరాచాలు, ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.. ఈ ఘటనలపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలో గోవులను మాతగా పూజిస్తారు.. ఇప్పుడు గోశాలలో గోవులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు..

Read Also: Beerla Ilaiah : కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు..

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్‌ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నా.. సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. అసలు ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు ఆర్కే రోజా..

Exit mobile version