Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదన్న సీబీఐ రిపోర్టుతో ఎన్టీవీతో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయ లబ్ధి కోసం మా అధినేతలపై కుట్రలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో పందికొవు లేదా ఇతర జంతువుల పదార్థాలు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక, సీబీఐ చేసిన విచారణలో, పంది కొవ్వు సహా ఏ జంతు కొవ్వు పదార్థాలు లడ్డులో లేవని తుది నివేదికలో స్పష్టంగా తేలిపోయింది.. డైరీ నిర్వాహకులు, అధికారులు చేసిన ఈ కుట్రను రాజకీయ దురుద్దేశంతో వైఎస్ జగన్‌పై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నించారని భూమన పేర్కొన్నారు.
Read Also: Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..
అయితే, పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభలో ఇష్టానుసారంగా మాట్లాడి, లక్షల లడ్డులను అయోధ్యకు పంపామంటూ అబద్ధాలు చెప్పాడు అని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. శుభ్రం చేయాల్సింది గుడిమెట్లను కాదు, నీ నాలుకను అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజలు కూడా గమనిస్తున్నారు.. ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.. రేపు కూటమి ప్రభుత్వం చేసిన అపచారంపై తిరుపతిలోని శ్రీనివాస నిందా పరిహార హోమం చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
