NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..

Bumana

Bumana

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది.. విజయవాడకు అమిత్ షా వచ్చిన సందర్భంగా హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్‌కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయంకు పంపిన ఘనత తమదని అన్నారు. మీ పాలనలో టీటీడీ పరువు తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.

Read Also: Amit Shah: అమిత్‌ షాను చూస్తే అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు

దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు.. తిరుమలలో బాలుడు మృతి చెందాడు, బిర్యానీ పొట్లాలు కొండపైకి వెళ్ళాయి, మద్యం కూడా కొండపై దొరికాయి.. సర్వ సాక్షి శ్రీ వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు పాపాల పుట్ట కొండగా మారిందని మండిపడ్డారు. పశువుల దొడ్డిలో తోచినట్లు క్యూలైన్‌లో తోచి పెట్టారు.. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్‌ పై చర్యలు తీసుకోకుండా జిల్లా ఎస్పీని బదిలీ చేశారని అన్నారు. టీటీడీ చైర్మన్‌కు టీడీపీ నాయకులు సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశికి సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు.. రూ.70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారని అన్నారు. తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ 4 సార్లు దొరికింది.. సనాతన ధర్మం కాపాడతా అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన అటవీ శాఖలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Read Also: Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్

లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారు.. న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు టికెట్ల అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారని అన్నారు. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది.. ఈ అపరాధాలకు శిక్ష తప్పదని భూమన ఆరోపించారు. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.. అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోందని దుయ్యబట్టారు. భయం, భక్తి లేకుండా పోయింది.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు రూ.25 లక్షలు చంద్రబాబు ప్రకటన చేస్తే, టీటీడీ నుంచి నగదు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.