NTV Telugu Site icon

TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..

Ttd Hundi

Ttd Hundi

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి హుండీ కొత్త రికార్డు సృష్టించింది.. టీటీడీ చరిత్రలో తొలిసారి రూ.140 కోట్ల మార్క్‌ను దాటింది శ్రీవారి హుండీ ఆదాయం.. వరుస సెలవులతో తిరుమలకు ఆగస్టు నెలలో భక్తులు పోటెత్తారు.. రోజువారీ హుండీ ఆదాయం గననీయంగా పెరుగుతూ వచ్చింది.. దీంతో.. తొలిసారి రూ.140 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది.. ఆగష్టు మాసంలో 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆగస్టు నెలలో మొత్తంగా హుండీ ద్వారా శ్రీవారికి రూ. 140 కోట్ల 7 లక్షల ఆదాయం లభించిందని వెల్లడించింది.. ఇదే సమయంలో.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 10 లక్షల 79 వేల 900గా నమోదైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Read Also: Booster Dose: బూస్టర్‌ డోస్‌పై కేంద్రం కీలక సూచనలు..

Show comments