Tirumala: తిరుమల వెళ్లే వారికి బిగ్ షాక్. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. ఆలయ ద్వారాలు తిరిగి రేపు తెల్లవారు జామున 3 గంటలకు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ద్వారాలు తెరవగానే ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు, పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ వెల్లడించింది.
Read Also: Japan: జపాన్‌లో రాజకీయ ప్రకంపనలు.. ప్రధాని పదవికి షిగేరు రాజీనామా..
అయితే, అన్నప్రసాద సముదాయాన్ని రేపు ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. ఈ సమయంలో భక్తులకు పంపిణీ చేయడానికి 30 వేల ఆహార ప్యాకెట్లను రెడీ చేసినట్లు వెల్లడించారు. అలాగే, రేపు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఆలయంలో జరిగే ఈ మార్పులను భక్తులు గమనించాలని సూచనలు జారీ చేసింది.