TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి మూడు రోజులు పాటు రద్దు చేసినట్లు పేర్కొనింది. ఇప్పటికే 30వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు టికెట్లు జారీ చేసే విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.
Read Also: HrithikRoshan : కొడుకులతో కలిసి డాన్స్ అదరగొట్టిన హృతిక్ రోషన్.. వీడియో వైరల్
అయితే, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో పూర్తి చేసిన విక్రయాలు చేయనుంది. జనవరి 9 నుంచి తిరిగి శ్రీవాణి దర్శన టిక్కెట్లను పున:రుద్దరణ చేసే యోచనలో టీటీడీ ఉంది. ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి.. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో దర్శన టిక్కెట్లు జారీ చేసేలా ప్లాన్ చేస్తుంది. ఒకరోజు ముందుగా ఆన్ లైన్ లో 1000 టికెట్లు విడుదల చేసే యోచనలో టీటీడీ ఉంది. తిరుమలతో పాటు రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్ లైన్ కౌంటర్లు రద్దు చేసే అవకాశం ఉంది.
