TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- ఇవాళ లక్కిడిఫ్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల..
- ఎల్లుండి ఉదయం 10 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం..
- ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్ ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ సేవా టికెట్లు, దర్శన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో.. తిరిగి సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతి ఇస్తోన్న విషయం విదితమే కాగా.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.. మరోవైపు, నిన్న శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు.. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
Read Also: Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
Also Read
తాజావార్తలు
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!