Tirumala: సీఎం ఆదేశాలు.. భక్తుల నుంచి టీటీడీ ఫీడ్ బ్యాక్
- సీఎం చంద్రబాబు ఆదేశాలు..
- రంగంలోకి దిగిన టీటీడీ ఈవో..
- భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదే విధంగా ప్రసాదాలతో పాటు అన్నప్రసాదంలోనూ క్వాలిటీ పెంచేలా చర్యలను దిగారు.. ఇక, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.. ఆ తర్వాత వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలక సూచనలు చేశారు. ఏడుకొండలపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేసిన సీఎం.. ఏ విషయంలోనూ రాజీపడొద్దు.. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి.. తిరుమలకు పూర్వ వైభవం తేవాలని పేర్కొన్నారు..
Read Also: Lalu Prasad Yadav: ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు శ్రీకారం చుట్టింది.. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో వేచివున్న భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఈవో.. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఫీడ్ బ్యాక్ స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం ప్రకియగా కొనసాగిస్తాం అన్నారు.. కాగా, గతంలో.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో క్వాలిటీ తగ్గందని.. అన్నప్రసాదంలోనూ క్వాలిటీ లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుని.. ఎప్పటికప్పుడు మార్పులు తెచ్చేలా టీటీడీ సిద్ధం అవుతోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!