NTV Telugu Site icon

Tirumala: సీఎం ఆదేశాలు.. భక్తుల నుంచి టీటీడీ ఫీడ్‌ బ్యాక్‌

Ttd

Ttd

Tirumala: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదే విధంగా ప్రసాదాలతో పాటు అన్నప్రసాదంలోనూ క్వాలిటీ పెంచేలా చర్యలను దిగారు.. ఇక, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.. ఆ తర్వాత వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలక సూచనలు చేశారు. ఏడుకొండలపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేసిన సీఎం.. ఏ విషయంలోనూ రాజీపడొద్దు.. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి.. తిరుమలకు పూర్వ వైభవం తేవాలని పేర్కొన్నారు..

Read Also: Lalu Prasad Yadav: ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..

ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణకు శ్రీకారం చుట్టింది.. భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్ స్వీకరణకు స్వయంగా రంగంలోకి దిగారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో వేచివున్న భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్ తీసుకున్న ఈవో.. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఫీడ్‌ బ్యాక్ స్వీకరణ కార్యక్రమాన్ని నిరంతరం ప్రకియగా కొనసాగిస్తాం అన్నారు.. కాగా, గతంలో.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో క్వాలిటీ తగ్గందని.. అన్నప్రసాదంలోనూ క్వాలిటీ లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని.. ఎప్పటికప్పుడు మార్పులు తెచ్చేలా టీటీడీ సిద్ధం అవుతోంది.