Site icon NTV Telugu

TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Ttd

Ttd

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..

Read Also: శబాష్ Smriti Mandhana.. ICC వన్డే ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్.1 గా!

ఇక, ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ మానిటరింగ్ చేస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశాం.. భక్తుల సౌకర్యార్థం అదనంగా 8 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు.. కర్నాటక రాష్ర్టం బెల్గాంలో ఏడు ఏకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం లభించింది.. గుంటూరు జిల్లా తుల్లురు మండలం అనంతవరం గ్రామంలో ఆలయ అభివృద్ధి పనులకు 7.2 కోట్ల రూపాయలు కేటాయించింది టీటీడీ.. గుంటూరు జిల్లా ఖాజా గ్రామంలో దాతలు ఇచ్చిన 89 లక్షల విలువైన స్థలం స్వీకరణకు ఆమోదం తెలిపింది పాలకమండలి.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దళితవాడలో వెయ్యి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు..

Read Also: RRC SR Recruitment 2025: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. అర్హులు వీరే.. మంచి జీతం

మరోవైపు, టీటీడీపై అసత్య ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు.. ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయన్నారు టీటీడీ ఈవో సింఘాల్.. 19వ తేదీన జిల్లా యంత్రాంగంతో కలసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం అన్నారు అనిల్ కుమార్ సింఘాల్.. అయితే, టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన సింఘాల్‌ను చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు.

Exit mobile version