NTV Telugu Site icon

Tirupati Stampede: టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు..

Ttd

Ttd

Tirupati Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు.. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా.. ముగ్గురిపై బదిలీ వేటు వేసింది.. ఇక, తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు.. ఆ నిర్ణయాలు టీటీడీ పాలకమండలిలో చర్చించి అమలు చేస్తారని పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రోజు టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది..

Read Also: Mental Health : ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు ? పక్కన ఉంటే మీరు గుర్తించొచ్చు

టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం.. రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్కులు అందిస్తామని తెలిపారు.. మృతి చెందిన భక్తుల కుటుంబంలో విద్యార్థుల వుంటే వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారి కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.. జ్యుడిషియల్ ఎంక్వయిరీలో భాద్యులను గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్‌.. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా.. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు..