Site icon NTV Telugu

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి జులై 15 వరకు కొత్త రూల్..!

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్షదైశం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.. వేసవి సెలవులు కావడంతో.. తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ.. ఈ సమయంలో స్వయంగా విచ్చేసే వీఐపీలకు మాత్రమే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.. మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించబోతోంది టీటీడీ.. అయితే, సిఫార్సు లేఖలు తీసుకుని శ్రీవారి దర్శానికి ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులు.. ఈ విషయాన్ని గమనించాలి..

Read Also: RAPO 22 : రామ్ పోతినేని సినిమాలో రియల్ స్టార్.?

మరోవైపు.. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.. మరోవైపు.. ఆదివారం రోజు 78,177 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా వెల్లడించింది టీటీడీ..

Exit mobile version