Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ
- తిరుమల: టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- పరకామణిలో సుమారు రూ. 100 కోట్ల చోరీ జరిగిందని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపణలు..
- అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో రూ. 40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారు: భాను ప్రకాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలోని పరకామణిలో దొంగతనం చేస్తున్న రవికుమార్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా చోరీ చేసినా డబ్బుతో కోట్లు రూపాయల రియల్ ఎస్టేట్లో పెట్టారు.. ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు.. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తిరుమల స్వామివారి పరకామణిలో వంద కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగింది అన్నారు. స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారు.. రూ. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు.. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించింది.. వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నిటిని సీజ్ చేయాలని ఆదేశించిందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Bengaluru: గుంతలపై నిరసనలు.. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఇక, అప్పట్లో కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళారు అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో చాలా మంది వైసీపీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భాగస్వామ్యలుగా ఉన్నారు, త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయన్నారు. త్వరలో ఓ అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ రూ. 100 కోట్ల స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను బయట పెట్టబోతున్నారు.. స్వామివారి సొత్తును కీలకమైన ఓ పోలీస్ అధికారి దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు అందరికి ఇందులో వాటాలు వెళ్ళాయి.. అప్పటి అధికారులు ఈ సొమ్మును పంచుకున్నారు.. ఈ కుంభకోణం జరిగినప్పుడు చైర్మన్‌గా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు భూమన దీనికి సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, దోచుకున్న సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చారు.. ఈ ఘటన తరువాత అన్ని రకాల సాక్ష్యాలను తొలగించి, ధ్వంసం చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు