Site icon NTV Telugu

TTD AEO Suspended: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు..

Tirumala

Tirumala

TTD AEO Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. పుత్తూరులోని ఓ చర్చిలో ప్రార్థనలు చేసినట్లే అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి కంప్లైంట్ చేశాడు. ఇక, దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఏఈవో రాజశేఖర్ బాబుని ఈవో శ్యామలరావు సస్పెండ్ చేశారు.

Read Also: Virat Kohli: క్రికెట్‌ జుజుబీ.. అక్కడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!

అయితే, దశాబ్దం కాలంగా స్వీపర్ స్థాయి నుంచి డిప్యూటీ ఈవో స్థాయి వరకు ఉన్న అన్యమత ఉద్యోగస్తులకు టీటీడీలో కొలువు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగస్తులను టీటీడీ ఛైర్మన్ బదిలీ చేశారు. చైర్మన్ సహా సభ్యులందరూ ధార్మిక కార్యక్రమాలు, తిరుమల పవిత్రతే మా ప్రథమ బాధ్యత అనే ధ్యేయం అని ప్రకటించారు.

Exit mobile version