Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు మరియు ఆర్జిత సేవా టిక్కెట్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్ల కేటాయింపు జరగనుంది.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 91,020 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం రూ.3.54 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, నటుడు ఆది పినిశెట్టి కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!