Site icon NTV Telugu

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

Modi

Modi

Tirupati Stampede: తిరుపతిలో జరిగిన తొక్కిసలా­టలో భక్తులు మృతి చెందిన వార్త తెలిసి ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. తొక్కిసలాట ఘటన నన్ను బాధించిందన్నారు. మరణించిన వారి కుటుంబాల అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియ­జేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. గాయప­డిన వారు త్వరగా కోలుకో­వాలని ఆయన కోరారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో బుధవారం నాడు అర్ధరాత్రి పోస్ట్‌ చేశారు.

Read Also: Ram Charan : ఆ సినిమా చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నా : రామ్ చరణ్

ఇక, మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం అయ్యారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చెప్పుకొచ్చారు. ఈ ఘటన నన్ను తీవ్ర బాధ కలిగించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో వైఫల్యంపై అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. దానికి అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని క్వశ్చన్ చేశారు. మృతుల సంఖ్య పెరగకుండా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాసేపట్లో తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.

Exit mobile version