NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం..

Ttd

Ttd

Tirumala: శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ప్రారంభించారు అర్చకులు. ముందుగా పుణ్యా వచన కార్యక్రమాన్ని నిర్వహించి అటు తరువాత మహా శాంతి యాగాన్ని ప్రారంభించారు. చివరగా వాస్తు హోమం నిర్వహించి అనంతరం పంచగవ్య పదార్థాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో అన్నప్రసాద పోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేయడంతో మహా శాంతి యాగం ముగియనుంది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమపండితులుతో పాటు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.

Read Also: Ravichandran Ashwin: ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్‌

కాగా, తిరుమల లడ్డూ కల్తీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది.. దీనిపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది.. అధికార కూటమి నేతలు.. వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.. దీనిపై వివిధ మఠాధిపతులు కూడా స్పందిస్తున్న విషయం విదితమే.. ఇక, ఈ నేపథ్యంలో మహా శాంతి యాగాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తోంది టీటీడీ..