NTV Telugu Site icon

Events in November at Tirumala: ఉత్సవాల సీజన్‌గా మారిన నవంబర్‌.. తిరుమలలో జరిగే విశేష కార్యక్రమాలు ఇవే..

Ttd

Ttd

Events in November at Tirumala: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారింది. శ్రీవారి ఆలయంలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో వూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే తరహలో నవంబర్ మాసంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..

ముందుగా నవంబర్ 5వ తేదీన నాగుల చవితి సందర్భంగా శ్రీవారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనం పై మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు మలయప్పస్వామి. వార్షిక బ్రహ్మోత్సవాలు తరువాత స్వామివారు పెద్దశేష వాహనాలపై భక్తులకు దర్శనం ఇచ్చేది ఒక్క నాగుల చవితి పర్వదినం రోజునే. అటు తరువాత 8వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చెయ్యనున్నారు అర్చకులు. 9వ తేదీన వార్షిక పుష్పయాగం నిర్వహిస్తారు.. స్వామివారికి 10 టన్నలు పుష్పాలతో 7 సార్లు హృదయం వరకు పుష్పార్చన నిర్వహించనున్నారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం మండపంలో పుష్పయాగాని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ..

Read Also: Nandyal Crime: పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

ఇక, నవంబర్ 13వ తేదీన కైసిక ద్వాదశి నాడు శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో వేకువజామున ఉగ్రశ్రీనివాసమూర్తి భక్తులు మాడవీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. శ్రీవారి ఆలయంలోని గర్బాలయంలో పంచబేరాలు వుంటాయి. అందులో ఉగ్రశ్రీనివాసమూర్తిని కౌతుక బేరంగా పిలుస్తారు. ఒక్క కౌశిక ద్వాదశి రోజున మాత్రమే ఉగ్రశ్రీనినాసమూర్తి విగ్రహాలు ఆలయం వెలుపలకు వేంచేపు చేస్తారు. అది కూడా సూర్యోదయం లోపు స్వామివారి మాడవీధుల ఉరేగింపు నిర్వహిస్తారు. నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు మలయప్పస్వామి గరుడు వాహనం పై మాడవీధులలో ఉరేగుతు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇలా నవంబర్ నెలలో వరుసగా స్వామివారి ఆలయంలో విశేష పర్వదినాలు సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Show comments