కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారింది. శ్రీవారి ఆలయంలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో వూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు…