Pooja Hegde: దాని నుంచి బయటపడటానికి సమయం పడుతుంది : పూజా హెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గ్రాఫ్ సంపాదించుకుంది పొడుగుకాళ్ల సుందరి పూజ హెగ్డె. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాతో మొదలు పెట్టి చివరగా వచ్చిన ‘రాధే శ్యామ్’ వరకు ఈ అమ్మడు తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ గత కొంత కాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నప్పటకి సరైన హిట్ మాత్రం లేదు. చేసిన సినిమాలన్నీ దారుణంగా నిరాశపరిచాయి. ఒక్క భాషలో కాదు ఆమె నటించిన అన్ని భాషల సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘దేవా’ మూవీలో నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ తన సిని ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..
పూజా హెగ్డే మాట్లాడుతూ..‘ నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బంధుప్రీతి లేదు. నా తల్లిదండ్రులు న్యాయవాదులు. మా తమ్ముడు ఆర్థోపెడిక్ సర్జన్. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. నా కెరీర్లోనే ఊహకందని విషయం ఇది. కనీసం నటి కావాలని కూడా ఎప్పుడు కోరుకోలేదు. కానీ అనుకోకుండా ఈ సినీ ప్రపంచం లోకి రావడం ఆనందంగా ఉంది. చిత్రపరిశ్రమకు వచ్చి దాదాపు దశాబ్దం గడిచింది. ఎంతో మంది అద్భుతమైన చిత్ర నిర్మాతలు, నటి నటులతో కలిసి పనిచేశాను. నటిగా నేను చాలా దూరం వచ్చాను.. కానీ ప్రయాణించాల్సింది ఇంకా ఉంది. నేను ఎప్పుడు సినిమాల విషయంలో ఒత్తిడిగా ఫీలవ్వను. అలాగే నటనలో నేను ‘స్విచ్ ఆన్ అండ్ ఆఫ్’ అనేది కూడా నేర్చుకోలేదు. ఎందుకంటే కొన్ని పాత్రలు ఇప్పటికీ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అందులో భావోద్వేగాలు ఉంటే ఆ పాత్రకు ఎక్కువ కనెక్ట్ అవుతా. ‘రాధే శ్యామ్’, ‘రెట్రో’ లాంటి సినిమాల్లో నేను పోషించినవి అలాంటి పాత్రలే. కొన్నిసార్లు మనం ఎంచుకున్న పాత్రల నుండి బయటపడడానికి సమయం పడుతుంది. అందుకే నా దగ్గర స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే .
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!