NTV Telugu Site icon

Vaikunta Ekadasi 2025: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల వెళ్తున్నారా..? ఇది మీ కోసమే..

Ttd

Ttd

Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు.. ఇక, ఈ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారా దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు భక్తులు.. పురాణాల ప్రకారం.. పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని చెబుతారు.. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు కూడా ఉంది.. అయితే, 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది.

Read Also: Jethwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇక, వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి ఇప్పటికే టీటీడీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన శ్రీవాణి దర్శన టికెట్లను, 24వ తేదీన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టనుంది.. సర్వదర్శనం భక్తులకు సంబంధించి తిరుపతి, తిరుమలలో జనవరి 8వ తేదీ రాత్రి నుంచి దర్శన టోకెన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఇక స్వామివారి ఆలయంలో ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి, ద్వాదశి పర్వదిన రోజులలో మాత్రమే అనుమతించే టీటీడీ.. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆగమ పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు సూచన మేరకు వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేలా 2020 నుంచి మార్పులు తీసుకువచ్చింది. పది రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూండడంతో.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తుగానే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టీటీడీ. టోకెన్ కలిగిన భక్తుడు కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు చేరుకుంటే వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ.

Read Also: KTR: ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..

జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడం.. 11వ తేదీ ద్వాదశి పర్వదినం కావడం.. అటు తర్వాత మరో ఎనిమిది రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించునుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో పెడతారు.. 10 రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నారు అధికారులు. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి జనవరి 8వ తేదీ రాత్రి నుంచి కూడా తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు ఆఫ్‌లైన్‌ విధానంలో టోకెన్ల జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలోని ఎమ్మార్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ లతోపాటు తిరుమలలోని కౌస్తూభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు చేసేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ.. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించునున్నారు.

Read Also: Jethwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇక, సిఫార్సు లేఖలకు సంబంధించి పది రోజులపాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే వారికి బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేయనున్నారు.. 10 రోజులపాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనుండగా.. ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. మరోవైపు గోవిందమాల భక్తులకి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని ప్రకటించింది. ఇలా పదిరోజులు పాటు భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది.. అయితే, వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులు.. టీటీడీ పేర్కొన్న సూచనలు గమనించి.. టికెట్లు కానీ, టోకెన్లు కానీ.. దక్కించుకుంటేనే ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

Show comments